Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని దామరమడుగులో జరిగిన బస్సు ప్రమాదంపై మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద క్షత గాత్రులను అన్నీ విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ఫోన్ లో మాట్లాడిన రాజమోహన్ రెడ్డి… క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరుకు చెందిన గడ్డం వనమ్మ కుటుంబానికి 5 లక్షల సాయాన్ని ప్రకటించారు.