పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Sullurpeta ) – ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం తల్లిదండ్రులకు చెప్పకుండా నెల్లూరుజిల్లాకు విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిని సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు నెల్లూరుజిల్లా పోలీసులు. యువతి ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా ఆధారంగా నెల్లూరుకు వెళ్లినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు… విషయాన్ని నెల్లూరుజిల్లా ఎస్పీ విజయరావుకు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ సూళ్లూరుపేట పోలీసులను అప్రమత్తం చేశారు. సాంకేతకతను ఉపయోగించి యువతి సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి ఆ యువతి క్షేమంగా తీసుకొచ్చారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి నెల్లూరుకు రప్పించారు. మంగళవారం సూళ్లూరుపేట సిఐ కార్యాలయంలో యువతిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Read Previous

రైతుకు దన్నుగా నిలవండి… మంత్రి కన్నబాబును కోరిన కోటంరెడ్డి

Read Next

పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి… ఎస్సీ, ఎస్టీలకు మేయర్ స్రవంతి పిలుపు

Leave a Reply

Your email address will not be published.