రైతుకు దన్నుగా నిలవండి… మంత్రి కన్నబాబును కోరిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – జిలకర మసూరి ( బిపిటి 5204 ) రకం వరి పండించే రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును అభ్యర్ధించారు. మంగళవారం తాడేపల్లిలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిలకర మసూరి ( బిపిటి 5204 ) రకం వరి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని… ఈ రకం వరి ధాన్యాన్ని కూడా అక్కడ కొనుగోలు చేసే విధంగా ప్రొక్యూర్మెంట్ పోర్టల్ లో మార్పులు చేయాలని అభ్యర్ధించారు. అలాగే చెరువు పోరంబోకు, అటవీ పొలాలు, అడంగల్ లో నమోదు కాని సాగు భూముల్లో పండించే వరి ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేయాలన్నారు. గత ఏడాది ఈ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశారని గుర్తు చేశారు. దీనిపై చర్యలు తీసుకుని చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read Previous

పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి – కమిషనర్ దినేష్ కుమార్

Read Next

పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు పోలీసులు

Leave a Reply

Your email address will not be published.