Clock Of Nellore ( Kavali ) – నెల్లూరుజిల్లా కావలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్ధిని రైలు కింద పడి ఆత్మహత్యతు పాల్పడింది. ఏఎస్ మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన గాయత్రి ( 21 ) కావలి జవహార్ భారతి కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. స్థానికంగా ఉంటున్న ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటూ అక్కడే హాస్టల్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో గానీ శనివారం ఉదయం కావలి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు అంటున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.