59వ రోజు… జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట కార్యక్రమంలో నిర్విరామంగా కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యకర్తల నివాసాలకు స్వయంగా వెళ్లి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా 59వ రోజైన గురువారం ఆయన 37వ డివిజన్ లోని కార్యకర్తల నివాసాలకు వెళ్లారు. క్రాంతినగర్, భగవత్ పాళెం, రాం నగర్, మిలటరీ కాలనీ ప్రాంతాల్లోని కార్యకర్తల నివాసాలకు వెళ్లారు. కార్యకర్తతో పాటూ వారి కుటుంబసభ్యులతో ఏకాంతంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై తానున్నానంటూ భరోసా ఇచ్చారు.

Read Previous

కావలి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గా మాలేపాటి…

Read Next

అవసరమైతే పోరాటాలకు సిద్దం… జిల్లా విభజనపై ఆనం ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.