Clock Of Nellore ( Kavali ) – నెల్లూరుజిల్లాలోని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గా మాలేపాటి సుబ్బానాయుడు నియమితులైనారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కావలి ఇంఛార్జ్ గా సుబ్బానాయుడును నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలియజేశారు. మరో వైపు తనను నియోజకవర్గ ఇంఛార్జ్ గా నియమించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు మాలేపాటి సుబ్బానాయుడు.