Clock Of Nellore ( Kadapa ) – కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణఘటన కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఖాజీపేటకు చెందిన శివ ప్రాసద్‌కు భార్య, పదకొండేళ్ల కూతురు ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను కూతురిపై కన్నేశాడు. నిద్రపోతున్న సమయంలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి గమనించింది. కుమార్తె ద్వారా విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ కుళ్లాయప్ప తెలిపారు. అనంతరం చిన్నారిని పిలిపించి విచారించారు. నిందితుడు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.