‘అతడో ఆర్మీ జవాన్.. పోర్న్ చూసే అలవాటు ఉంది.. కామ వాంఛ తీర్చుకునేందుకు..’

Clock Of Nellore ( Prakasam ) – ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లిలో పదిరోజుల క్రితం హత్యకు గురైన బాలుడి కేసును పోలీసులు చేధించారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమా శ్రీనాథ్ (11) తాటిచెర్ల మోటు జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈనెల 22న పాఠశాల నుంచి తిరిగి వచ్చి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు గిద్దలూరు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 25న ఇడకమల్లు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాలుడి పొట్ట భాగంలో ఓ రాయిని కట్టి బావిలో పడేశారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాం తప్పిపోయిన భూమా శ్రీనాథ్​దిగా గుర్తించారు.

కేసు విచారణను మరింత ముమ్మరం చేసిన పోలీసులు హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఓ ఆర్మీ జవాన్​ అని ఎస్పీ వెల్లడించారు. సెలవుపై వచ్చిన నిందితుడు వెంకట ప్రశాంత్ కుమార్ గత కొంత కాలంగా స్వగ్రామం అక్కపల్లిలో ఉంటున్నట్లు తెలిపారు. నేరం తనపైకి రాకుండా పోలీసుల దృష్టి మరల్చేందుకు నిందితుడు వెంకట ప్రశాంత్ కుమార్ పక్కా స్కెచ్ వేశాడు. హత్య చేసిన మరుసటి రోజు తనకు తెలిసిన స్నేహితుడి ద్వారా నకిలీ ఫ్రూఫ్​లతో సిమ్ కార్డు తీసుకున్నాడు. బాలుడిని కిడ్నాప్ చేశానని.., రూ. 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానని బాలుడి పెదనాన్నకు ఫోన్​కు మేసెజ్ పెట్టాడు. మెసేజ్​​పై పోలీసులకు బాలుడి బంధువులు సమాచారం ఇవ్వటంతో వారు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆధునిక సాంకేతికను ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Previous

కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం…

Read Next

ఇక దేనికీ భయపడం.. వ్యవస్థను స్తంభింపజేస్తాం…

Leave a Reply

Your email address will not be published.