నెల్లూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసులకు గాయాలు

Clock Of Nellore ( Kodavalur ) – నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, కమ్మపాళెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన కుటుంబం తమిళనాడులోని అరుణాచలం వెళ్లే క్రమంలో కమ్మపాళెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వెనుక నుండి లారీని ఢీకొట్టింది. లారీని ఢీ కొట్టిన అనంతరం కారు సర్వీసు రోడ్డులోని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరు మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read Previous

పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్

Read Next

రాంగ్ రూట్ లో వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published.