రైతన్నకు బాసటగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి… పొలాల్లో తిరుగుతూ కష్ట సుఖాలు…

Clock Of Nellore ( IndukurPet ) – రైతు సంక్షేమమే రాష్ట సంక్షేమమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. పిఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల సందర్భంగా ఇందుకూరు పేట మండలం, డేవీస్ పేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు స్థానిక రైతులు ఘన స్వాగతం పలికారు. వరి కంకులు, టెంకాయ మాలలతో ఘన సన్మానం చేసి తమ అభిమానం చాటుకున్నారు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల సందర్భంగా రైతులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మహిళా రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి, సాగులో కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2 వేల 675 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలుతెలియచేసారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 16 వేల 938 మంది రైతులకు 9 కోట్ల 30 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. గత రెండేళ్ల కూటమి పాలనలో 3 విడతలుగా మొత్తం 31 కోట్ల 32 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందని ఆమె వెల్లడించారు. కోవూరు నియోజకవర్గంలో రైతుల కోసం 41 ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2,389 మద్దతు ధర కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు కోనసీమగా పేరుగాంచిన ఇందుకూరుపేట మండలంలో 800 ఎకరాల్లో అరటి, 1400 ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోందని.. అరటికి హెక్టారుకు 42 వేలు కొబ్బరికి .53 వేల సబ్సిడీ అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఆకుకూరలు, కూరగాయల సాగుకు హెక్టారుకు 24 వేలు, కోకో సాగుకు 30 వేల రాయితీతో పాటు, ఆయిల్ పామ్ రైతులకు ఉచిత మొక్కలు అందచేయడంతో నాలుగేళ్ల పాటు ఏటా 10 వేల 500 పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఆమె వివరించారు. వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా 50 శాతం సబ్సిడీతో స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు అందిస్తూనే.. మినీ ట్రాక్టర్ల కొనుగోలుపై సామాన్య రైతులకు 1 లక్షా 96 లక్షలు, ఎస్సీ మహిళా రైతులకు ఏకంగా 2 లక్షల 40 వేలభారీ సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చాక ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాల అనడిచేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత రబీ సీజన్ లో ధాన్య సేకరణ సందర్భంగా 48 గంటలలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు సైతం అధికారులు, మిల్లర్లు అదే స్పూర్తితో పని చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా వున్నారని రైతు బాగుంటుంటేనే రాష్టం సుభిక్షంగా వుంటుందన్న ఏకైక లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు జనరంజక పాలన అందిస్తున్నారని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష పత్రాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యవసాయ అధికకారిని అనిత, కోవూరు, బుచ్చి కోవూరు కొడవలూరు మండలాల వ్యవసాయ అధికారులు శ్రీహరి, విజయలక్ష్మి, రజని, హార్టికల్చర్ అధికారి ప్రసన్న కుమారి లతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు తెలుగుదేశం మరియు కూటమి పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Previous

అన్నదాత సుఖీభవ పథకం రైతులకు వరం : కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడి

Read Next

నెల్లూరుజిల్లాకు మణిహారం సాగర్ డిఫెన్స్ కెంపెనీ : మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి

Leave a Reply

Your email address will not be published.