Clock Of Nellore ( Nellore ) – జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ వల్ల మత్య్స కారులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లయితే ప్రభుత్వం వాటిని ముందుండి పరిష్కరిస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణములో జరిగిన మత్య్సకారులు మరియు అధికారులతో ముఖాముఖి కార్యక్రమములో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మత్య్సకారులు మరియు అధికారులతో సుదీర్గ చర్చ అనంతరం మంత్రి కోల్లు రవీంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ చాలా రాష్ట్రాలు, దేశాలు సైతం సదరు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకై పోటీ పడుతున్నాయన్నారు. సమస్యలు ఏమైనా స్థానిక నాయకుల సహకారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థానికులు మరియు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ సమావేశము నిర్వహించడం జరిగిందన్నారు.
సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు వల్ల మత్య్సకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, మత్య్స సంపద ఎక్కడ ఉన్నది, సైక్లోన్ మరియు అల్ప పీడనాల వల్ల సముద్రంలో ఇరుక్కొన్న వారిని రక్షించవచ్చని తెలిపారు. సుమారు రెండు వేల అయిదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో 29 ఎకరాలలో డిఫెన్సు పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. ఉత్సాహము, తపన, నేర్చుకోవాలనే దృక్పదం ఉన్న స్థానిక యువతకు ఉపాధి అవకాశం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 114 ఎకరాలలో హార్బరును ఏర్పాటు చేయడం జరిగిందని, ముందు చూపుతోనే అనుబంద పరిశ్రమలు ఏర్పాటుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఆవకాశం ఉందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులకు మంచి గిరాకి ఉందన్నారు. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ కంపెనీ చేసిన బోట్ల పరీక్షకి కేవలం 150 మీటర్లు కేటాయించడం జరిగిందని. పరిశ్రమల ఏర్పాటుకై స్థానికులు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. 2014 – 15 సంవత్సరంలో ముందు చూపుతో అప్పటి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారని, కృష్ణ పట్నం పోర్టు ఏర్పాటు ద్వారా నెల్లూరు రూపు రేఖలు మారాయన్నారు. 20 పాయంట్ల పాలసి అమలు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రానున్నాయన్నారు.
శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ సోదీర్గ పోరాటం తరువాత కృష్ణ పట్నం పోర్టుకు ప్రత్యామ్న్యాయంగా జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బరు ఏర్పడిందన్నారు. ఎక్కడా లేని విదంగా జెట్టి మరియు మినీ హార్బరు స్థానంలో మెగా హార్బరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 288 కోట్ల రూపాయలతో హార్బరు ఏర్పాటు చయడం జరిగిందనారు. మంత్రి కొల్లు రవీంద్రకు నెల్లూరులోని పోర్టుల పై, మత్స్య కారులపై మంచి అవగాన ఉందన్నారు. జువ్వల దిన్నె హార్బరును స్థానిక శాసనసభ్యుల ఆద్వర్యములో నిర్వహణ కమిటి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి మాట్లాడుతూ కావలి నియోజికవర్గ మత్య్సకారులకు మంచి ఆస్తి జువ్వల దిన్నె హార్భరు అని కొనియాడారు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెని ఏర్పాటు వల్ల ఎలాంటి అసౌకర్యం కలుగదన్నారు. దళారులతో నిమిత్తం లేకుండా మార్కెటింగ్ కు అవకాశం ఉంటుందన్నారు. రానున్న రోజులలో మరిన్ని పరిశ్రమలు రానున్నాయన్నారు. 990 మీటర్ల జెట్టి తోపాటు సుమారు 1250 బొట్లు పనిచేస్తున్నాయన్నారు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఏర్పాటు ద్వారా జి.పి.యస్ విధానము ద్వారా మత్య్స సంపద కనుగొనవచ్చన్నారు. అంతే కాకుండా విపత్తుల సమయంలో తప్పి పోయిన మత్య్సకారులను రక్షించుకొనే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రములో తొలుత మత్య్స శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హార్బరు విశేషాలను తెలియచేశారు. ఈ కార్యక్రమములో శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి ,రాం గోపాల రెడ్డి, షిప్ యార్డ్ చైర్మన్ సత్య, డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
