బెంగుళూరు రేవ్ పార్టీపై స్పందించిన కాకాణి : తనకెలాంటి సంబంధం లేదని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – ఓటమి భయంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో ఓ కారుపై కాకాణికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ పై ఆయన స్పందించారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. తన పేరుతో ఉన్న స్టిక్కర్ కారుకు తనకు సంబంధం లేదని చెప్పారు. ఎవరో స్టిక్కర్ ను కలర్ జిరాక్స్ కాపీ తీసి పెట్టి ఉండవచ్చునని తెలిపారు. తనకు ఆ స్టిక్కర్ ఉన్న కారే లేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధారాలు చూపాలని, అవసరమైతే సిబిఐ విచారణకైనా తాను సిద్దమని కాకాణి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే సోమిరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు.

Read Previous

ఆపరేషన్ మొబైల్ హంట్ : 600 ఫోన్లను బాధితులకు అందజేసిన నెల్లూరు పోలీసులు

Read Next

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్ : స్వాగతం పలికిన కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.