Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో ఆపరేషన్ మొబైల్ హంట్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ఒక కోటి 50 లక్షల విలువైన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వాటిని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు సంబంధించి 600 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో వాటిని బాధితులకు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అందజేశారు. మొబైల్ హంట్ ద్వారా ఇప్పటి దాకా ఆరు విడతల్లో 2320 సెల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ తెలియజేశారు. సరైన బిల్లులు లేని, సెకండ్ హ్యాండ్స్ సెల్ ఫోన్లు కొనవద్దని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. మొబైల్ పోగొట్టుకున్న బాధితులు 9154305600 నంబర్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మీ ఫోన్ గుర్తించే బాధ్యత పోలీసులు తీసుకుంటారని ఎస్పీ హఫీజ్ తెలియజేశారు.
