Clock Of Nellore ( Nellore ) – పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఒక్క నెల్లూరే కాదని, రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని జనసేన పార్టీ నేత, ప్రముఖ సినీ నృత్య దర్శకులు జానీ మాస్టర్ స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పదవులు ఆశించి తాను జనసేన పార్టీలో చేరలేదని వెల్లడించారు. కేవలం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చే స్వచ్ఛంధంగా పార్టీలో చేరానని చెప్పారు. సినిమాల్లో తాను సంపాదిస్తే డబ్బులో 30 శాతం తను పుట్టిన గడ్డ అయిన నెల్లూరులో ఖర్చు చేస్తానని ఈ సందర్భంగా జానీ మాస్టర్ ప్రకటించారు. జీవితాంతం పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు.