కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మెరుగైన పౌర సేవలు : మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) – నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ విభాగాన్ని నెల్లూరు మేయర్ స్రవంతి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కంట్రోల్ సెంటర్లోని వివిధ విభాగాలను పరిశీలించి, వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నెల్లూరు నగర పాలక సంస్థ ప్రాంగణంలో 8.5 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగిందన్నారు. నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో ప్రజల వద్ద నుండి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణిత సమయంలో పరిష్కరించి వాటిని మానిటరింగ్ చేయడం జరుగుతుందన్నారు. నగర వ్యాప్తంగా మెరుగైన పారిశుధ్య సేవలు అందించడం సాధ్యమవుతుందని, పారిశుధ్య నిర్వహణ పనులను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షించే సాంకేతికతను కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేశారని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నగర వ్యాప్తంగా, స్పందన పరిష్కార వేదిక, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా పెండింగ్ లో ఉన్నవి కూడా ఇక్కడ నుండి మోనిటరింగ్ చేయడం జరుగుతుందని, నగరపాలక సంస్థ సమగ్ర సమాచార విభాగం వంటి వివిధ విధులను నిర్వహించనున్నారని తెలిపారు. సమస్యలకు 1800 425 1113 మరియు 14420 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపి నేత పోట్లూరి జయవర్ధన్, 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వకోలు విజయలక్ష్మి , 35వ డివిజన్ కార్పొరేటర్ యాకసిరి వాసంతి, కో-ఆప్షన్ మెంబర్ మొబీన, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

పవన్ ఆదేశిస్తే నెల్లూరు నుండి పోటీ చేస్తా : స్పష్టం చేసిన జానీ మాస్టర్

Read Next

కంటైనర్ టెర్మినల్ తరలించవద్దు – పోర్టు సిఈఓతో సోమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.