నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

Clock Of Nellore ( Kovur ) – నెల్లూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోవూరు సమీపంలోని పడుగుపాడు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్లున్న ట్రాలీని వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్ లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెల్లూరు నుండి విజయవాడ వైపు ట్రాలీ వెళుతుండగా, డ్రైవర్ ట్రాలీని అకస్మాత్తుగా నిలిపివేశాడు. అదే క్రమంలో వెనుక కాటన్ లోడుతో వేగంగా లారీ వస్తూ అకస్మాత్తుగా ఆగిన ట్రాలీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగంగా నుజ్జు నుజ్జు అయింది. క్యాబిన్ లోనే ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ చనిపోయారు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నుజ్జు నుజ్జు అయిన లారీని వేరు చేశారు. సుమారు గంట పాటూ శ్రమించి రెండు వాహనాలకు పక్కకు జరిపి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. చనిపోయిన ఇద్దరూ తమిళనాడు వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

ఆటో ఎక్కిన అజీజ్

Read Next

పాత కోర్టు భవనంలో సహకార శాఖ కార్యాలయం: ప్రారంభించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Leave a Reply

Your email address will not be published.