Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని పాత కోర్టు భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. బుధవారం జిల్లా సహకార అధికారి తిరుపాల్ రెడ్డితో కలిసి కలెక్టర్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆధునీకరించిన ఈ భవనంలోని మొదటి అంతస్థును జిల్లా సహకార శాఖకు కేటాయించారు. ఇక నుంచి ఈ భవనంలో సహకార శాఖ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి తిరుపాల్ రెడ్డి, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, మత్స్యశాఖ, వ్యవసాయ శాఖ జేడీలు నాగేశ్వరరావు, సుధాకర్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, సహకార శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
