Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు ఆయన్ను పూలమాలలతో సన్మానించారు. భారీ కేక్ కట్ చేయించారు. వైసీపి నేతలు కూడా తరలివచ్చి గిరిధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరో వైపు గిరిధర్ రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఒంగోలు నుండి తిరుపతికి జాతీయ రహదారిలో వెళ్తున్న వైసీపి జిల్లా ఇంఛార్జ్ బాలినేని శ్రీనివాస రెడ్డిని కూడా కనపర్తిపాడు వద్ద కలిసి సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.
