Clock Of Nellore ( Nellore ) – మీ ఆశీస్సులు, దీవెనలు ఉంటే మరో సారి మీకు సేవ చేసుకునే అవకాశం లభిస్తుందని, ఆ దిశగా తనను దీవించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తటస్థులను అభ్యర్ధించారు. అన్నీ పార్టీలను ఇష్టపడేవారు, పార్టీలంటే ఇష్టం లేకుండా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి తటస్థుల దీవెన కార్యక్రమం పేరుతో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. 3వ రోజు 17, 18 డివిజన్లకు చెందిన తటస్థులతో సమావేశమయ్యారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. తనకు మరో సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. మీ ఆలోచనలు, సూచనలు ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం తటస్థులంతా ఎమ్మెల్యే కోటంరెడ్డికి పూర్తి మద్దతు ప్రకటించి, ఆయనకు వారి దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో 17, 18 డివిజన్ల కార్పొరేటర్లు పేనేటి సుధాకర్, అశోక్ నాయుడు పాల్గొన్నారు.
