Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సెంట్రల్ జైలు ఆవరణలో ఉన్న మామిడి చెట్లకు సంబంధించిన మామిడి కాయలు, పండ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ జైలు ఆవరణలో గల 104 మామిడి చెట్లకు సంబంధించిన మామిడిని ఈనెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగంగా వేలం వేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటల్లోగా రూ 10వేలు ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. వేలంలో గెలుపొందిన వారు వెంటనే మొత్తం పైకం చెల్లించి సంబంధిత మామిడి తోటను స్వాధీనం చేసుకోవచ్చు. వేలంలో గెలుపొందని వారికి వారి ధరావతు సొమ్ము వేలం ముగిసిన వెంటనే తిరిగి చెల్లిస్తామని, పూర్తి వివరాలకు నెల్లూరు వైయస్సార్ నగర్ సమీపంలోని కేంద్రకారాకారంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
Tags: Nellore Central Jail