సిఎం చంద్రబాబు నెల్లూరుజిల్లా పర్యటనకు విస్త్రృత ఏర్పాట్లు

Clock Of Nellore ( Atmakur ) – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల 1వ తేదీనా నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందజేయనున్నారు. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సిఎం పర్యటనపై జిల్లా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. మే 1వ తేదీనా సిఎం చంద్రబాబు ఆత్మకూరుకు చేరుకుని సమీప గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే నారంపేట వద్ద MSME పార్కును ప్రారంభిస్తారు. తర్వాత టిడిపి నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. సిఎం పర్యటన నేపద్యంలో ఇప్పటికే హెలిప్యాడ్ ను సిద్దం చేస్తున్నారు. సిఎం చేతుల మీదుగా సామాజిక పెన్షన్లు అందుకోనున్న వారిని ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టారు. సిఎం పర్యటనకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read Previous

54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం : నెల్లూరులో నిర్భంధ తనిఖీలు

Read Next

సర్కారు వారి పాట : ఈనెల 25న జైలు మామిడి కాయల వేలం

Leave a Reply

Your email address will not be published.