అతి తక్కువ ఖర్చుతోనే అపోలో హాస్పిటల్ లో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు

  • మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో అపోలో హాస్పిటల్ నెంబర్ వన్
  • కేవలం 2.5 లక్షల ఫీజుతోనే పూర్తి స్థాయిలో ఆపరేషన్
  • రోబోటిక్ సహాయంతో చేసే శస్త్ర చికిత్సలు 100 శాతం సురక్షితం
  • సద్వినియోగం చేసుకోవాలన్న నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హాస్పిటల్ లో ఇవాళ జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, ఆర్ధోపెడిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానంద రెడ్డి , డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేయడంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ అగ్రగామిగా ముందుకు వెళుతుందని చెప్పారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అధునాతన విధానంలో రోబోటిక్ సాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రోబోటిక్ సాయంతో చేసే శస్త్ర చికిత్సలు 100 శాతం ఖచ్చితత్వంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతే కాకుండా అతి తక్కువ రక్త స్రావంతో పాటూ శస్త్ర చికిత్సకు సంభందించిన మచ్చలు కూడా ఉండవన్నారు. శస్త్ర చికిత్స తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుందని, వేగంగా కోలుకోవచ్చునని చెప్పారు. శస్త్ర చికిత్స తర్వాత హాస్పిటల్ లో ఎక్కువ రోజులు కూడా ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. నెల్లూరులో అపోలో హాస్పిటల్ ను ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేవలం 2లక్షల 50వేల ఫీజుతోనే మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. ఉన్న రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరాం సతీష్, డాక్టర్ వివేకానంద రెడ్డి , డాక్టర్ శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రపంచ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం 2025

Read Next

నెల్లూరులో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య…

Leave a Reply

Your email address will not be published.