
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పొదలకూరు రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్డు అభివృద్ధి విషయంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, రోడ్లు – భవనాల శాఖ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యి చర్చించారు. పొదలకూరు రోడ్డు అభివృద్ధికి సంబంధించి అన్నీ శాఖల అధికారులు ఎవరి బాధ్యత వారు తీసుకుని యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ పాల్గొన్నారు.