
- నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం
- మీడియాతో డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ
- 100కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు వెల్లడి
- అన్నీ జబ్బులకు కిడ్నీ సమస్యలే కారణమన్న వైద్యులు
- కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని పిలుపు
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ.కే. చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి. మస్తాన్ వలీ వెల్లడించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రక్తాన్ని వడపోసే కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం శరీరమంతా ఉంటుందని, వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని అన్నారు. కిడ్నీకి సమస్య తలెత్తిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రతీ 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటుందని, సాధారణ వ్యక్తుల కంటే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించినట్లు డాక్టర్ శ్రీ రామ్ సతీష్, డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ వెల్లడించారు. కిడ్నీ సమస్యలు ఎదుర్కొనే వారికి గుండెపోటుతో పాటూ ఇతర స్ట్రోకులు, ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ఇతర జబ్బులు సోకకుండా ఉంటాయని వారు తెలియజేశారు. షుగర్, అధిక రక్తపోటు, ఊబకాయం సమస్యలతో బాధపడే వారికి కిడ్నీ సమస్యలు అధికంగా వస్తాయని కనుక ఆయా సమస్యలతో బాధపడే వారు సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చునని చెప్పారు. పరిశుభ్రమైన మంచినీరు తాగడం మూలంగా కూడా కిడ్నీ సమస్యలు దూరమవుతాయన్నారు. జనాభాలో 10 శాతం మంది ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఆలోచించి, కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఇప్పటి వరకూ 100కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. కిడ్నీ సమస్యల చికిత్సతో పాటూ శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అపోలో హాస్పిటల్ లో అనుభవజ్ఞులైన వైద్యులతో పాటూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, కిడ్నీ రోగులు అపోలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు ఈ ఏడాది ” ఆర్ యూ కిడ్నీ ఓకే ?, డిటెక్ట్ అర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్… ! ” అనే నినాదంతో ముందుకెళుతున్నామని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో వారితో పాటూ హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కూడా పాల్గొన్నారు.