
- ఘనంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ 10వ వార్షికోత్సవం
- వార్షికోత్సవం సందర్భంగా వాకథాన్ నిర్వహణ
- చికిత్స కంటే నివారణ మేలు అనే నినాదంతో సాగిన వాకథాన్
- వాకథాన్ ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్
- పదేళ్ల విజయ ప్రస్థానంపై ప్రత్యేక వ్యాసం
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటయ్యి పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎంతో మంది ఆరోగ్యకరమైన జీవితాలను పొందడం మరింత సంతోషంగా ఉందని అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్ వెల్లడించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన వాకథాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ బాలరాజు ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘ చికిత్స కంటే నివారణ మేలు’ అనే నినాదంతో నగరంలో వాకథాన్ కార్యక్రమం జరిగింది. విఆర్సీ నుండి తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. విఆర్సీ నుండి ప్రారంభమైన ఈ వాకథాన్ రామలింగాపురం మీదుగా చిల్డ్రన్స్ పార్కు వరకూ సాగింది. ఈ వాకథాన్ లో అపోలో హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఈఓ నవీన్ మాట్లాడుతూ అపోలో హాస్పిటల్స్ నెల్లూరులో ప్రారంభమయ్యి 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ పదేళ్ల ప్రస్థానంలో వైద్యపరంగా ఎన్నో విజయాలను సాధించామని, వేల మంది రోగులు తిరిగి ఆరోగ్యవంతులుగా మారి నూతన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, నూతన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మెట్రో సిటీల్లోని కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా నెల్లూరులో అపోలో హాస్పిటల్ ను తీర్చిదిద్దామని, వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచామని నవీన్ తెలియజేశారు.
నెల్లూరు అపోలో హాస్పిటల్ 10 ఏళ్ల విజయ ప్రస్థానం… !
నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ను 2015 మార్చి 8వ తేదీనా ప్రారంభించారు. అప్పటికీ అపోలో సంస్థలో అది 50వ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో నిరంతరం 850 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
అవార్డులు మరియు గుర్తింపులు…. !
న్యూ ఇండియా అస్యూరెన్స్ ఇన్సూరెన్స్ సంస్థ యొక్క 7వ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డును పొందింది. గ్రూప్ బి విభాగంలో వ్యవస్థాపక దినోత్సవ సదస్సులో అపోలో హాస్పిటల్ క్లినికల్ ఎక్స్ లెన్స్ అవార్డును దక్కించుకుంది. రోగి యొక్క ఆరోగ్య సంరక్షణ మరియు భద్రత విషయంలో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ( NABH ) గుర్తింపును కూడా అపోలో హాస్పిటల్ పొంది ఉంది. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే డిప్లొమేట్ నేషనల్ బోర్డు ( DNB ) గుర్తింపును కూడా పొందింది. కొవిడ్ సమయంలో విశేషమైన వైద్య సేవలు అందించినందుకు గానూ నెల్లూరుజిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ – 2022 అవార్డును కూడా అపోలో హాస్పిటల్ పొందింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే గ్రీన్ అండ్ ఎన్విరాన్ మెంటల్ ఫ్రెండ్లీ హాస్పిటల్ – 2018 అవార్డును కూడా పొందింది.
సాధించిన విజయాలు… !
గడచిన రెండేళ్లలో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 220కి పైగా రోబోటిక్ టోటల్ నీ రిప్లేస్ మెంట్ ( TKR ) శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. 100 మందికి పైగా మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేపట్టారు. నెల్లూరులో తొలిసారిగా ABO అననుకూలత మార్పిడి. AI న్యూరాలజీ విభాగం ద్వారా స్ట్రోక్ ప్రిడిక్షన్ అధ్యయనాన్ని ప్రారంభించింది. మొదటి బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ మరియు అవయవ మార్పిడి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 1వ కేసుగా నమోదైన కార్టిగ్రో- స్టెమ్ సెల్ థెరపీ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీని నెల్లూరులో విజయవంతంగా నిర్వహించారు. ఏపిలో అత్యధిక మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్న హాస్పిటల్ నెల్లూరు అపోలో హాస్పిటల్. లక్ష మందికి పైగా అపోలో హాస్పిటల్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. స్ట్రోక్ కేసుల కోసం హబ్ మరియు స్పోక్ మోడల్ ను ప్రవేశపెట్టాం. నెల్లూరు అపోలో హాస్పిటల్ అత్యధికంగా 4.9గా గూగుల్ రేటింగ్ లో కొనసాగుతంది.
ఇతర ప్రత్యేకతలు… !
నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రతిష్ఠాత్మక సంస్థలలో విద్యానభ్యసించిన అగ్రశేణి యువ కన్సల్టెంట్ వైద్య బృందం అందుబాటులో ఉంది. రోబోటిక్ టోటల్ నీ రిప్లేస్ మెంట్ ( TKR ) సర్జరీలు, ట్రాన్స్ ప్లాంట్స్, సిఆర్‌టి-డి, అనూరిజం క్లిప్పింగ్‌లు, మెకానికల్ థ్రోంబెక్టమీ మొదలైన అన్ని హై-ఎండ్ వైద్య సదుపాయాలు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఉన్నాయి. బెస్ట్ ఎమర్జెన్సీ సర్వీసులతో పాటూ క్రిటికల్ కేర్ కూడా అందుబాటులో ఉంది. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఓపి విధానం పూర్తిగా డిజిటల్ రూపంలో కొనసాగుతుంది.