Clock Of Nellore ( Nellore Rural ) – గత వైసీపి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల్లోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని ఆమంచర్ల పంచాయితీ పరిధి అప్పయ్యకండ్రిగలో 50 లక్షలతో చేపట్టే సిసి రోడ్డు పనులకు కోటంరెడ్డి మంగళవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 7 నెలల్లోనే ఆమంచర్ల పంచాయితీలో ఒక కోటి 50 లక్షల అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధే అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఆమంచర్ల ప్రజలు తనను ఎంతగానే ఆదరిస్తున్నారని వారి రుణం తీర్చుకుంటానని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందుకూరు రమణమ్మ, ఉప సర్పంచ్ మనినేని వేణు నాయుడు, జిల్లా పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు అల్లాభక్షు తదితరులు పాల్గొన్నారు.
