స్వర్ణాల చెరువులో మీనోత్సవం : చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని స్వర్ణాల చెరువులో జిల్లా మత్స్యశాఖ మీనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వర్ణాల చెరువులో 8 లక్షల చేప పిల్లలను వదిలారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ చేపల వేట వృత్తిగా జీవిస్తున్న కుటుంబాల వారి సంక్షేమం, అభివృద్ధికి మత్స్యశాఖ విశేష కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. స్వర్ణాల చెరువులో వందల కుటుంబాల వారు చేపల వేట వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారని, వారి కోసమే ఈ మీనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.

Read Previous

కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన ఎంపి వేమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.