Clock Of Nellore ( Gudur ) – అసెంబ్లీలో మూడు ఆర్ధిక కమిటీలకు నూతన ఛైర్మైన్లను, సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించారు. ప్రజా పద్దుల కమిటితో పాటూ అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఛైర్మైన్లతో పాటూ సభ్యులను నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి ఒకరికి అవకాశం లభించింది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు అంచనాల కమిటీలో స్థానం లభించింది. ఆయన అంచనాల కమిటీలో సభ్యునిగా నియమితులైనారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.