
Clock Of Nellore ( Nellore ) – వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా పత్రికలు ముందుకెళ్లాలని, అలాంటి పత్రికలనే ప్రజలు ఆదరిస్తారని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. క్లాక్ ఆఫ్ నెల్లూరు పత్రిక ద్వారా రూపొందించిన 2025 నూతన సంవత్సర స్పోర్ట్స్ థీమ్ క్యాలెండర్ ను మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. భారత దేశంలో అత్యధికంగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడలను తెలియజేస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాలెండర్ ఎంతో బాగుందని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆలిండియా తెలుగు జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ( All India Telugu Journalists Fedaration ) మరియు క్లాక్ ఆఫ్ నెల్లూరు పత్రిక ఎడిటర్ గోపీనాథ్ సమక్షంలో మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి నెల్లూరులోని తమ నివాసంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం క్యాలెండర్ ను పరిశీలించి చాలా బాగుందని కితాబునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని అన్నారు. అలాంటి పత్రికలకే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన గోపినాథ్ సారధ్యంలో క్లాక్ ఆఫ్ నెల్లూరు పత్రిక వాస్తవాలకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పిఆర్వో నందిగం చంద్రశేఖర వర్మ, జర్నలిస్టులు రమేష్ రెడ్డి, పి. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.