
Clock Of Nellore ( Nellore ) – పిల్లలు మరియు పెద్ద వారు చలికాలంలో చాలా అసౌకర్యంగా ఉంటారు. అందువల్ల వారిని చలికాలంలో వచ్చే రోగాల నుంచి రక్షించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం పది ఆరోగ్య సూత్రాల ద్వారా చలి కాలంలో వచ్చే రోగాల నుంచి రక్షణ పొందవచ్చని నెల్లూరు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె. పెంచల ప్రసాద్ వెల్లడించారు. శీతాకాలం నేపద్యంలో ఆయన మీడియా ద్వారా ప్రజలకు పలు జాగ్రత్తలను వివరించారు.
1. చలి కాలంలో వచ్చే ఉష్ణోగ్రతల మార్పులను గుర్తించడం — పిల్లలు మరియు పెద్దవారు ముఖ్యంగా చలి కాలం లో జలుబు మరియు దగ్గు బారిన పడుతుంటారు, పెద్దలు ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఎక్కువ జలుబు బారిన పడుతుంటారు. పిల్లలు, పెద్దలు ఉండే రూములో ఉష్ణోగ్రత పొడిగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కిటికీలను మూసివేయాలి.
2. రోగాల బారిన పడుకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం —- పెద్దలు ఎక్కువగా చలి కాలం రోగాల బారిన పడుతుంటారు. అందువల్ల వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కాళ్లకు సాక్సులు వేసుకోవాలి అలాగే గదిలో తిరిగే నేల చల్లగా ఉంటే చెప్పులు ధరించాలి. దీని వల్ల శరీరం చల్లబడకుండా, కాళ్లు జారకుండా ఉంటాయి.
3. వాతావరణానికి తగ్గట్లు బట్టలు ధరించడం —- చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు సరైన బట్టలు ధరించాలి. వాళ్ళు బయటకి వెళ్లేపుడు ఉన్ని దుస్తులు ధరించడం ఎంతో ముఖ్యం. ఉలెన్ దుస్తులు వాళ్ళని పొడిగా మరియు వెచ్చగా వుంచుతాయి. ముఖ్యంగా పెద్దవారు తక్కువ ఉష్ణోగ్రతలు వున్నపుడు “నూలు కోటు” వేసుకోవడం ద్వారా వారి శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు. పెద్దలు వారి శరీరాన్ని కాపాడుకోవటానికి ముఖము, చేతులు, చెవులు, మరియు మెడను ఎప్పుడు గ్లవ్స్, స్కార్ఫ్ మరియు మంకీ కాప్స్ తో కవర్ చేసుకోవాలి.
4. పనులు జాగ్రత్తగాచేయడం —- పెద్దలు చలికాలంలో నడిచేటప్పుడు రోడ్లపై జారే అవకాశం ఉంది,పొగ మంచు వల్ల రోడ్డు సరిగా కనపడక పోవడం, పిల్లలు సైకిల్ తొక్కేపుడు జారడం మనం చూస్తుంటాం. అందువల్ల హెల్మెట్, వ్రిస్ట్, ఎల్బో మరియు మోకాలు కవచం ధరించడం ఎంతో ముఖ్యం. వీటి వల్ల శరీరానికి గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు.
5. చలికాలంలో తీసుకునే ఆహారంపై జాగ్రత్త వహించడం —- సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల మనం చలికాలంలో వచ్చే రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఫ్లూ మరియు జలుబు రాకుండా నివారించడానికి శీతాకాలంలో సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా కీలకం. కచ్చితంగా పిల్లలు మరియు పెద్దలకి శీతాకాలంలో సమతుల్యమైన ఆహారం, పోషక విలువలు కల ఆహారం ఇవ్వడం ఎంతో ముఖ్యం. డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్ ముక్కలు, హోల్ వీట్ తో తయారైన ఫుడ్స్, యోగర్ట్ మరియు కొన్ని పండ్లు ఇవ్వడం చాలా ముఖ్యం. ఇవి వారి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి.
6. తగినంత ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి—– పిల్లలు చలి కాలం చమట తక్కువగా పోయడం వల్ల దాహం సరిగా వేయదు, అందువల్ల వారు తగినంత నీటిని తీసుకోరు. దానివల్ల వారు డీహైడ్రేషన్ కి గురి అవుతారు. దీనిని అరికట్టే దానికి మనం తక్కువ షుగర్ శాతం వుండి ఎక్కువ విటమిన్ సి వున్న ద్రవ పదార్ధాలు ఇవ్వడం ద్వారా మనం శీతాకాలంలో వచ్చే జలుబు మరియు వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించ వచ్చని అధ్యయనాల్లో తేలింది. కెఫీన్ లేని టీ మరియు హాట్ కోకోవ యివ్వడం ద్వారా మనం మరిన్ని మంచి ఆరోగ్యం ఇవ్వవచ్చు. అందువల్ల వారి రోగ నిరోధక శక్తి బలపడి వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంది.
7. వృద్దులు నిత్యం వారి వద్ద సెల్ ఫోన్ అందుబాటులో ఉంచుకోవాలి —- దీనివల్ల వారికి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనపుడు సెల్ ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందించేదుకు వీలుగా ఉంటుంది. తద్వారా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి వేగంగా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంటుంది.
8. చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి —- చలికాలంలో నీళ్లు చల్లగా వుండటం మూలంగా ఆహారం తినే ముందు విధిగా చేతులు శుభ్రం చేసుకోరు. దాని వల్ల సులువుగా రోగాల బారిన పడే అవకాశం ఉంది. అందుకని ఆహారానికి ముందు తప్పని సరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. చలికాలంలో వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవాలని.
9. కోల్డ్ క్రీమ్స్ వాడుతూ ఉండాలి —- శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే నేపద్యంలో శరీరంపై దాని ప్రభావం చూపుతుంది. దాని వల్ల చర్మం పొడిగా అవ్వడం, దురదలు రావడం, చిన్న చిన్న గుల్లలు రావడం, పొట్టు రాలడం, సోరియాసిస్ మరియు వాపు రావడం జరుగుతుంది. కనుక తరచూ కోల్డ్ క్రీమ్స్ వాడుతుంటే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. కెమికల్స్ లేని కోల్డ్ క్రీములు వాడాలి. హెర్భల్ క్రీములు కూడా వాడుకోవచ్చు. కొన్ని దీర్ఘకాలిక చర్మ సమస్యలు వున్నపుడు చర్మ డాక్టర్ ను కలిసి చికిత్స చేసుకోవాలి.
10. తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి — మనకు తెలుసు పిల్లలూ మరియు పెద్దలు బయటకి వాకింగ్ కి వెళ్తువుంటారు. అప్పుడు వారికి తగిన జాగ్రత్తలు తీసుకుని పంపవలసి వస్తుంది. టెంపరేచర్ తక్కువగా వున్నపుడు ఇండోర్ లోనే వుండడం, ఇండోర్ లోనే వ్యాయామం చేయడం ఏంతో ముఖ్యమని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె. పెంచల ప్రసాద్ సూచించారు.