Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ కు వినియోగదారులు ఫోరం జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యామాల్లో, వివిధ ఛానళ్లలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమైనవని, ఆ వార్తల్లో బాధితుడికి జరిగిన కంటి ఆపరేషన్ తేదీ నాటికి భారతదేశంలో మెడికవర్ హాస్పిటల్స్ ఏర్పాటే కాలేదని మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై బుధవారం మెడికవర్ యాజమాన్యం స్పందించింది. ఓ వ్యక్తికి చేసిన కంటి ఆపరేషన్ వికటించిందని, ఆ ఆపరేషన్ 2017లో జరిగిందని చెబుతున్నారని, ఆ ఘటన జరిగిన నాటికి మెడికవర్ హాస్పిటలే లేదని వివరణ ఇచ్చింది. వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పు సింహపురి హాస్పిటల్ కు సంభందించింది అని పేర్కొన్నారు. 2017లో నెల్లూరులోనే కాకుండా భారతదేశంలో ఎక్కడా తమ హాస్పిటల్స్ లేవని మెడికవర్ యాజమాన్యం వెల్లడించింది. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో కంటి విభాగమే లేదని యాజమాన్యం గుర్తు చేసింది. వినియోగదారులు ఇచ్చిన తీర్పుకు మెడికవర్ హాస్పిటల్ కు సంభందం లేదని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. కొందరు చేస్తున్న ఈ దుష్ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేసింది. మెడికవర్ హాస్పిటల్ లో అనుభవజ్ఞులైన వైద్యులు, అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం వెల్లడించింది. ఎన్నో క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఘనత మెడికవర్ హాస్పిటల్ వైద్యులదని వివరించారు. అసలు కంటి విభాగమే లేని మెడికవర్ హాస్పిటల్ లో కంటి ఆపరేషన్ ఎలా చేస్తారని యాజమాన్యం పేర్కొంది. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది.