అపోలో హాస్పిటల్ లో విజయవంతంగా షోల్డర్ రీ ప్లేస్ మెంట్ సర్జరీలు

  • అపోలో హాస్పిటల్ లో విజయవంతంగా షోల్డర్ రీ ప్లేస్ మెంట్ సర్జరీలు
  • రోబోటిక్ విధానం ద్వారా 100 శాతం సర్జరీలు సురక్షితం
  • కేవలం 6 వారాల్లోనే కోలుకునే అవకాశం
  • వివరాలు వెల్లడించిన డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి, డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అత్యాధునిక రోబోటిక్ విధానం ద్వారా షోల్డర్ రీప్లేస్ మెంట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ షోర్డర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి, సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వారు షోల్డర్ రీ ప్లేస్ మెంట్ సర్జరీపై అవగాహన కల్పించారు. మొన్నటి వరకూ సాంప్రదాయ పద్దతుల ద్వారా జరిగే షోల్డర్ రీ ప్లేస్ మెంట్ సర్జరీలలో నేడు నూతన శకం ఆరంభమైందని అన్నారు. అపోలో హాస్పిటల్ లో రోబోటిక్ విధానం అందుబాటులో ఉందని, దీని ద్వారా 100 శాతం ఖచ్చితత్వంతో షోల్డర్ రీ ప్లేస్ మెంట్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉందన్నారు. రోబోటిక్ విధానం ద్వారా చేసే సర్జరీలలో నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని, రోగి వేగంగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కంప్యూటరైజ్ డ్ ప్లానింగ్ టెక్నాలజీ, సీటి స్కాన్ ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించే ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడం జరుగుతుందన్నారు.

దీర్ఘకాలికంగా భుజం నొప్పి అధికంగా ఉన్నవారు, సాధారణ శస్త్ర చికిత్సల ద్వారా నయం చేయలేని ఎముక పగుళ్లు ఉన్నవారు, భుజం ఆపరేషన్లు విఫలమైన వారికి ఈ రోబోటిక్ విధానం ద్వారా షోల్డర్ రీ ప్లేస్ మెంట్ శస్త్రచికిత్స చేస్తే 100 శాతం ఫలితం ఉంటుందని డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి, డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలియజేశారు. రోబోటిక్ విధానం ద్వారా చేసే ఈ శస్త్ర చికిత్స 100 శాతం సురక్షితమైనదని చెప్పారు. భుజం కీలు యొక్క దెబ్బతిన్న భాగాలను ముందుగా తొలగిస్తామని, దాని స్థానంలో ఎంతో సురక్షితమైన కృత్రిమ భాగాలను అమరుస్తామన్నారు. రోబోటిక్ విధానం ద్వారా షోల్డర్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకుంటే భుజం నొప్పి త్వరగా తగ్గిపోయి ఉపశమనం లభిస్తుందని, రీ ప్లేస్ మెంట్ ద్వారా అమర్చే ఇంప్లాంట్స్ ఎక్కువ కాలం మన్నుతాయని వెల్లడించారు. రోగి కేవసం 6 వారాల్లోనే తిరిగి తన పనులు తను చేసుకోవచ్చునని, రోజూ వారి సాధారణ వ్యాయామాలు కూడా చేసుకోవచ్చునన్నారు. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో రోబోటిక్ షోల్డర్ రీ ప్లేస్ మెంట్ సర్జరీలు 100 శాతం విజయవంతంగా చేస్తున్నామని, ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి, డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి కోరారు.

Read Previous

మెడికవర్ హాస్పిటల్ పై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం – స్పష్టం చేసిన యాజమాన్యం

Read Next

ఫ్యామిలీ కార్డ్ ను ప్రవేశపెట్టిన మెడికవర్ : ఆవిష్కరించిన ఎస్పీ కృష్ణకాంత్

Leave a Reply

Your email address will not be published.