Clock Of Nellore ( Muthukur ) – అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సేవలను అందిస్తుంది. నిరుపేదలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించి ప్రజలకు ఉచిత వైద్యం అందజేస్తున్నారు. తాజాగా మంగళవారం ముత్తుకూరు మండలం, పోతినాయుడుదిబ్బ గ్రామంలో మెడికవర్ వైద్య బృందం ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించింది. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌగంధిక వైద్య శిబిరానికి హాజరైన ప్రజలకు వివిధ పరీక్షలను నిర్వహించారు. సుమారు 150 మంది ఈ వైద్య శిభిరానికి హాజరయ్యారు. వారందరికీ రక్త పరీక్షలు, బీపి, ఈసీజి, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేకించి మహిళలకు గర్భసంచి పరీక్షలు, రొమ్ము పరీక్షలు నిర్వహించారు. చిన్న చిన్న సమస్యలున్న వారికి అక్కడే ఉచితంగా మందులు అందజేశారు. ఇతర సమస్యలున్న వారిని హాస్పిటల్ కు వస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పోతినాయుడుదిబ్బ గ్రామస్తులు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటూ పంచాయితీ మాజీ సర్పంచ్ పాముల శీనయ్య తదితరులు పాల్గొన్నారు.