న్యూరో కేర్ యాప్ ను ప్రారంభించిన డాక్టర్ బింధుమీనన్

Clock Of Nellore ( Nellore ) – మైగ్రేన్ తో బాధపడే రోగులకు న్యూరో కేర్ యాప్ ఎంతో ఉపయోగకరమని, ఆ యాప్ రోగులను నిత్యం పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్య సమాచారాన్ని సంభందిత వైద్యులకు చేరేవేస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ వెల్లడించారు. ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్యతో కలిసి బింధు మీనన్ న్యూరో కేర్ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ ప్రపంచ మెడదు దినోత్సవంలో భాగంగా ఈ ఏడాది మెదడు ఆరోగ్యం మరియు నరాల సంభందిత రుగ్మతల నివారణ అనే థీమ్ తో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీతో కలిసి మెదడు, నరాల రుగ్మతల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VESIT) పరిశోధన బృందంతో కలిసి న్యూరోకేర్ యాప్ ను రూపొందించామన్నారు. మైగ్రేన్ రోగులు, న్యూరాలజీ వైద్యుల మధ్య కమ్యూనికేషన్ ను ఈ మొబైల్ యాప్ పెంపొందిస్తుందని డాక్టర్ బింధు మీనన్ తెలియజేశారు. మైగ్రేన్ రోగులు ఈ యాప్ లో బటన్ నొక్కడం ద్వారా వారి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు వైద్యులకు తెలిస్తుందని దానికి అనుగుణంగా వైద్యులు అప్రమత్తమయ్యి, వారికి సరైన వైద్యం సకాలంలో అందించగలుగుతారని పేర్కొన్నారు. అంతే కాకుండా రోగికి ప్రతీ రోజూ వారి దిన చర్యను తెలియజేయడమే కాకుండా చిట్కాలను కూడా తెలియజేస్తుందన్నారు. మైగ్రేన్ బాధితుల జీవితాలను మెరుగుపరచడమే న్యూరో కేర్ యాప్ యొక్క లక్ష్యమని డాక్టర్ బింధు మీనన్ మీడియాకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్లు డాక్టర్ రశ్మి, డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

విద్యార్ధుల అస్వస్థతపై మంత్రి డోలా ఆగ్రహం : అధికారులపై చర్యలకు ఆదేశం

Read Next

అప్రమత్తంగా ఉండండి : అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం

Leave a Reply

Your email address will not be published.