ఎంపి వేమిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రతాప్ రెడ్డి

Clock Of Nellore ( Chennai ) – అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మైన్ ప్రతాప్ సి రెడ్డిని నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డిని ప్రతాప్ రెడ్డి, అపోలో ఎంపి సునీతా రెడ్డిలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతాప్ రెడ్డిని చెన్నైలో విపిఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి ఎంపిగా విజయం సాధించడం పట్ల అపోలో ప్రతాప్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసి, విపిఆర్ ను అభినందించారు. నెల్లూరుకు సంబంధించిన వివిధ అంశాలపై వారు కొద్ది సేపు చర్చించుకున్నారు.

Read Previous

నారాయణకు పురపాలకశాఖ : దేవదాయశాఖ మంత్రిగా ఆనం

Read Next

బక్రీద్ ఏర్పాట్లపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులతో సమీక్ష

Leave a Reply

Your email address will not be published.