Clock Of Nellore ( Nellore ) – మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. నెల్లూరుజిల్లాకు సంబంధించి మంత్రులుగా ప్రమాణం చేసిన డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామ నారాయణరెడ్డిలకు కూడా కీలక శాఖలే దక్కాయి. నారాయణకు మాత్రం గతంలో తాను నిర్వహించిన మంత్రిత్వ శాఖలనే కేటాయించారు. 2014 నుండి 2019 వరకూ ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. అదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కీలక పాత్ర వహించారు. తాజా టిడిపి ప్రభుత్వం ఏర్పడటం, అమరావతి నిర్మాణం మళ్లీ వేగవంతం చేయనున్న నేపద్యంలో నారాయణకు గతంలో ఇచ్చిన శాఖలనే సిఎం చంద్రబాబు కేటాయించారు. ఇక ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ, ధర్మాదాయ శాఖలకు కేటాయించారు. ఆనంకు కేటాయించిన శాఖలు కూడా కీలకమైనవే.
Tags: Endoment Minister Anam Rama Narayana Reddy Muncipal Minister Ponguru Narayana Nellore Ministers List