Clock Of Nellore ( Nellore ) – కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిసేందుకు నాయకులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ తరుణంలో నెల్లూరులోని వి.పి.ఆర్ నివాసం కోలాహలంగా మారింది. గురువారం కొడవలూరు మండలం రెడ్డిపాలెం, మానేగుంటపాడు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు. కోవూరు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రశాంతిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి… నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, వారి సహకారంతో గెలుపు సాధ్యమైందన్నారు.
