బెంగుళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు మంత్రి కాకాణి మిత్రుడే : సోమిరెడ్డి విమర్శలు

Clock Of Nellore ( Nellore ) – బెంగుళూరులోని ఎలక్ట్రానికి సిటీలో రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మిత్రుడు గోపాల్ రెడ్డేనని, ఆ ఫాం హౌస్ కూడా ఆయనదేనని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపి, కర్నాటక, తెలంగాణాలో మొత్తం 518 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఒక్కటే అక్కడ దర్శనమివ్వడంతో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కారుతో సంబంధం లేదని బుకాయిస్తున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆ కారులో లభ్యమైన కాకాణి ఒరిజినల్ పాస్ పోర్టు సంగతేంటని ప్రశ్నించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి అంతర్ రాష్ట్ర మాఫియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గతంలో కూడా అంతర్ రాష్ట్ర మాఫియాతో కలిసి లేని ఆస్తులు తనకు ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్ఠించారని పేర్కొన్నారు. నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో సోమిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాకాణి ఆగడాలు అంతర్ రాష్ట్రాలకు విస్తరించాయని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కాకాణిపై చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాన్ 4న కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, కాకాణి ఆగడాలపై టిడిపి ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుందని సోమిరెడ్డి వెల్లడించారు.

Read Previous

సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు : నెల్లూరుజిల్లాలో విస్త్రృతంగా తనిఖీలు

Read Next

కౌంటింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలి : అధికారులను ఆదేశించిన కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.