Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు మహాశయులకు నా ధన్యవాదాలు. ఎన్నికల రణరంగంలో నా విజయం కోసం చెమటోడ్చి పనిచేసిన టిడిపి మిత్రపక్ష బిజెపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు నా శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని నెల్లూరు టిడిపి ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి మీ కష్టసుఖాలలో అండగా ఉంటానని తెలియ చేసుకుంటున్నాను. అన్ని వేళలా నాకు అండగా నిలిచిన పాత్రికేయ సోదర సోదరీ మణులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని విపిఆర్ పేర్కొన్నారు.
అలాగే కోవూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా తనకు సహకరించిన వారికి పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి మరియు తెలుగుదేశం మిత్రపక్ష జనసేన బిజెపి నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ప్రత్యక్ష రాజకీయాలలోనికి ప్రవేశించిన అతి కొద్ది రోజులలోనే మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ఆదరించారు. అడుగడునా నా పట్ల ఆదరాభిమానాలు చూపించారు. బెదిరింపులకు భయపడకుండా ప్రలోభాలకు లొంగకుండా నా విజయమే లక్ష్యంగా పని చేశారు. మీ సొంత పనులు పక్కనపెట్టి మండే ఎండలను కూడా లెక్క చేయకుండా అక్కగా అమ్మగా మీరు నాపట్ల చూపించిన ప్రేమాభినాలు నేను ఎప్పటికి మరువలేను. ఓటమి భయంతో ప్రత్యర్ధులు రెచ్చగొట్టినా సమన్వయం పాటించి పోలింగ్ ప్రశాంతంగా జరపడంలో విజయం సాధించారు. నా విజయం మీ విజయంలా భావించి అహోరాత్రులు శ్రమించారు. మీ అందరి ఆశీర్వాదాలు దేవుడి ఆశీస్సులతో మనం గెలవబోతున్నాం. 45 రోజుల పాటు కోవూరు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తిరిగి కనీస మౌలిక సదుపాయాలు లేని దయనీయ పరిస్ధితులు ప్రత్యక్షంగా చూసాక నా మనుసు చలించి పోయింది. ఈ సందర్భంగా మీ ప్రతి సమస్యకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మరోసారి సవినయంగా తెలియ చేసుకుంటున్నాను. నా విజయం కోసం శ్రమించించిన ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి మరోసారి నా ధన్యవాదాలు తెలియజేశారు ప్రశాంతి రెడ్డి.