నెల్లూరు మెడికవర్ లో విజయవంతంగా ఊపిరితిత్తుల ఆపరేషన్

Clock Of Nellore ( Nellore ) – కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్నల్ పల్మనాలజిస్ట్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రోగి తన వద్దకు వచ్చినప్పుడు తాము నిర్వహించిన పరీక్షలలో లంగ్ ఆప్సస్, హైడ్రోటిక్ సిస్టె సమస్యతో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విధమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఈ పేషెంట్ కు ఆమె కలిసిన ఆసుపత్రులలోని డాక్టర్లు చెన్నై, లేదా హైదరాబాదు వంటి పట్టణాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి ఆపరేషన్ చేయించుకోమని చాలామంది డాక్టర్లు చెప్పారు. అలా చెప్పినప్పటికీ జాయిన్ అవ్వడంతో తాను పేషెంట్ ను పరిశీలించి వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ లోనే ఉన్న ఆధునిక వైద్య పరికరాలతో సర్జరీ చేయవచ్చని నిర్ధారించాం. అప్పటి వరకు చెన్నై కి వెళ్లి సర్జరీ చేయించుకోవాలనుకున్న బంధువులు తో మెడి కవర్ హాస్పిటల్ లోనే సర్జరీ చేస్తామని అందుకు మీ సమ్మతిని తెలిపినట్లయితే సర్జరీకి వెళదామని చెప్పడం జరిగింది. అందుకు పేషంట్ బంధువులు మా అమ్మాయికి ఇక్కడే సర్జరీ చేయండని కోరడంతో మెడికవర్ హాస్పిటల్ లోనే విజయవంతంగా ఊపిరితిత్తులకు సర్జరీ చేశామన్నారు. సర్జరీ తర్వాత తమ వద్దకు వచ్చిన సమయంలో ఆమె ఉన్న పరిస్థితి నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆమె ఉన్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు ఎటువంటి వ్యాధి వచ్చిన ప్రాథమిక దశలోనే డాక్టర్ వద్దకు వచ్చి తగిన పరీక్షలు నిర్వహించుకున్న ట్లయితే మెడికవర్ ఆసుపత్రిలో ఉన్న అధునాతన వైద్య పరికరాల తో ఎటువంటి వ్యాధి కైనా చికిత్స లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్ హెడ్ ఆఫ్ ది క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ 26 ఏళ్ల వయస్సు కలిగిన సుభాషిని అనే అమ్మాయి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ రావడం, కేసు విన్న తర్వాత ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో తాను కూడా రోగి పట్ల శ్రద్ధ తీసుకొని ఆమెకి స్వస్థత చేకూర్చామన్నారు. సందర్భంగా సుభాషిని తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ తమ బిడ్డ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఊపిరితిత్తుల నుండి చీము కారుతూ ప్రాణాపాయ స్థితిలో మెడికవర్ హాస్పిటల్ కి రావడం జరిగిందని అన్నారు. ముందుగా ఇతర ఆసుపత్రులలో డాక్టర్ల వద్దకు వెళ్ళినప్పుడు నెల్లూరులో కాకుండా చెన్నైలోని ఆసుపత్రులకు వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. మెడికవర్ హాస్పిటల్ లో ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలుసుకొని తాము ఇక్కడికి రావడం , ఎమర్జెన్సీ విభాగం నుండి వెంటనే డాక్టర్ కౌశిక్ రెడ్డి గారికి తెలియజేయడం, ఆయన వచ్చి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నా కుమార్తెకు వైద్య చికిత్సలు అందించడంతో ఇప్పుడు ఆరోగ్యంగా ఉందన్నారు. రోగి సుభాషిని మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రిలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తనను బాగా చూసుకున్నారని అందువల్ల త్వరగా కోలుకోగలిగాను అన్నారు. డాక్టర్లకు వైద్య సిబ్బందికి తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు.

Read Previous

స్ట్రాంగ్ రూములకు చేరిన EVM మెషీన్లు : కేంద్ర బలగాలతో భారీ భద్రత

Read Next

సహకరించిన నేతలకు ధన్యవాదాలు తెలియజేసిన విపిఆర్ దంపతులు

Leave a Reply

Your email address will not be published.