అభివృద్ధి, సంక్షేమం కావాలంటే సైకిల్ కు ఓటు వేయండి : ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి

Clock Of Nellore ( Indukuru Peta ) – సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్ధత చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డికి స్థానిక టిడిపి, బిజెపి, జనసేన నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కాలువలకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టి వర్షాకాలంలో ఉరిబిండివారి కండ్రిగ మూలకట్టు సంగాలలో వరద నీరు చేరకుండా నియంత్రిస్తానన్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అయ్యాక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి మొత్తలు, కొరుటూరు వయా సోమరాజుపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. జంగం వారి దరువు గ్రామ శ్మశాన రహదారితో పాటు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కలిపిస్తానని హామీ యిచ్చారు.

వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 2,000 కు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఇకపై వికలాంగులకు 6 వేలు యిస్తామన్నారు.పేదల జీవితాల్లో వెలుగునింపేందుకు చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ – భవిషత్తు గ్యారెంటీ అనే సంక్షేమ పధకాల ప్యాకెజ్ రూపొందించారన్నారు. అక్క చెల్లెమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యంతో పాటు ఏడాదికి మూడు సిలెండరుర్లు ఉచితంగా అందచేస్తారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్ధత చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ముస్లింలకు ఇస్తున్న రంజాన్ తోఫా, హిందూ, మరియు క్రిస్టియన్లకు ఇస్తున్న సంక్రాతి, క్రిస్మస్ కానుకలు కొనసాగిస్తామన్నారు. ముస్లింలకు గతంలో ఇస్తున్న దుల్హన్ పధకాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా కొనసాగిస్తామని హామీ యిచ్చారు. మీరందరు సైకిల్ గుర్తు పై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వలసిందిగా ప్రశాంతి రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Read Previous

ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి తప్పదు : ప్రచారంలో ప్రశాంతి రెడ్డి ధీమా

Read Next

నెల్లూరు అభివృద్ధి విజయసాయిరెడ్డితోనే సాధ్యం : ప్రచారంలో నేహారెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.