ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి తప్పదు : ప్రచారంలో ప్రశాంతి రెడ్డి ధీమా

Clock Of Nellore ( Vidavaluru ) – కమీషన్లు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోని ప్రసన్నకు ఈసారి ఓటమి తప్పదన్నారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అయిదేళ్లకోసారి ఎన్నికలప్పుడు మాత్రమే గ్రామాలకొచ్చి ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మండలానికో షాడోను పెట్టుకొని వసూళ్లకు పాల్పడే ప్రసన్న అవినీతి కారణంగానే గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మీరు కొల్లగొట్టిన కోట్లు అడిగారా… తాగడానికి గుక్కెడు నీళ్లు అడిగారు. చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానమడిగారు అటువంటి కనీస సదుపాయాలు కల్పించలేని ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రసన్న నిరక్ష్య ధోరణిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మాకేంటి మనకెంత అన్న ప్రసన్న అవినీతి కారణంగానే గ్రామాభివృద్ధి కుంటుపడిందన్నారు. ముదివర్తి గ్రామానికి వరద ముప్పు నుంచి రక్షణకై పెన్నానదికి రివీట్మెంట్ ద్వారా కరకట్టలు బలోపేతం చేస్తానన్నారు. ఇళ్ల పై ప్రమాదకరంగా వున్న 11 కెవి విధ్యుత్ లైన్ మారుస్తానని హామీ యిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చాక ముదివర్తి ముదివర్తి పాళెం మధ్య పెన్నా నదిపై కాజ్ వే నిర్మిస్తానన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలకు సంబంధించి వున్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానన్నారు. హరిజనవాడ నుంచి అరుంధతివాడ మధ్య సిసి రోడ్డు వేయిస్తామన్నారు. స్థానిక సంస్థలకు వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గ్రాట్లు అవినీతికి తావులేకుండా వినియోగిస్తే గ్రామాభివృద్ధి పెద్ద సమస్య కాదన్నారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే మాత్రమే సంక్షేమం అభివృద్ధి సాధ్యపడుతోందన్నారు. మన భావితరాల భవిషత్తు కోసం సమర్థులైన చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చొరవతో ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు స్థాపించి మరో శ్రీసిటీ లా మార్చి కోవూరు నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిషత్తు గ్యారెంటీ అనే సంక్షేమ పధకాల ప్యాకెజ్ రూపొందించారన్నారు. అక్క చెల్లెమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యంతో పాటు ఏడాదికి మూడు సిలెండరుర్లు ఉచితంగా అందచేస్తారన్నారు. సైకిల్ గుర్తు పై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వలసిందిగా ప్రశాంతి రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Read Previous

ఆదాలతోనే అభివృద్ధి : 12వ డివిజన్ లో ఆదాల కుమార్తె హిమబింధు ప్రచారం

Read Next

అభివృద్ధి, సంక్షేమం కావాలంటే సైకిల్ కు ఓటు వేయండి : ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published.