Clock Of Nellore ( Vidavaluru ) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనతో రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని వైఎస్సార్సీపీ యువ నాయకురాలు, పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో స్థానిక వైఎస్సార్సీపీ నేత తిక్కవరపు జనార్ధన్ రెడ్డి, ఎంపీటీసీ దాసరి శైలజ, పంచాయతీ వైస్ సర్పంచ్ మాదవయ్యతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో మరింత సంక్షేమం, అభివృద్ధి అందిస్తారని, రాష్ట్ర భవిష్యత్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఎన్ని విధాలుగా ప్రలోభపెట్టిన ప్రజలంతా జగన్ వైపే ఉంటారని అన్నారు. ప్రచారానికి వెళ్లిన మాకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. అడగకుండానే జగన్ కు మేమే ఓటేస్తామని బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. విజయసాయి రెడ్డి సతీమణి సునంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి చేసే ప్రభుత్వానికే గెలిపించుకోవాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారా పథకాలు కొనసాగుతాయని అన్నారు. నెల్లూరు విజయసాయి రెడ్డి సొంత జిల్లా. ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని, ఈ మేరకు చరిత్రలో మొదటి సారిగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారని అన్నారు. ప్రజలకు తమ కుటుంబం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
