ఆత్మకూరు పట్టణంలో జన జాతర : ప్రచారం నిర్వహించిన ఆనం, విపిఆర్

Clock Of Nellore ( Atmakure ) – ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వం గురువారం దద్దరిల్లింది. నెల్లూరు ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్ధి ఆనం రామ నారాయణరెడ్డిలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ జన సందోహం మధ్య ఆనం, విపిఆర్ లు ప్రచార రథం నుండి ముందుకు కదిలారు. ప్రతీ ఒక్కరికీ అభివాదం చేస్తూ తెలుగుదేశంపార్టీకి ఓటు వేయాలని అభ్యర్ధించారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపి ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి లేదని అన్నారు. తాను అర్ధిక మంత్రిగా ఉన్నప్పుడే ఆత్మకూరును జిల్లా కేంద్రం తరహాలో అభివృద్ధి చేశానని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తమను గెలిపించాలని సూచించారు.

Read Previous

వాకర్స్ తో విజయసాయిరెడ్డి మాటామంతి… టీ దుకాణాల్లో ఛాయ్ పే చర్చా…

Read Next

అరాచక వాదులను ఓడించండి : ప్రసన్నపై ప్రశాంతి రెడ్డి మండిపాటు

Leave a Reply

Your email address will not be published.