Clock Of Nellore ( Nellore ) – కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి స్వార్ధ ప్రయోజం పొందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థతి లేదని నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అన్నీ వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కావాలని ఆయన కాంక్షించారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో బీసిలు, సంచార జాతుల కులస్తులతో కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏ కులమైనా, ఏ మతమైనా అన్నీ వర్గాలను సమానంగా భావించి వారి సంక్షేమంతో పాటూ రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి, మరో చేత్తో 100 రూపాయలు లాక్కునే దుర్మార్గపు వైసీపి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి మాజీ డైరెక్టర్ ఎగిరెడ్డి రాజారత్నం, బీసీ నేత డి. జనార్ధన్ పాల్గొన్నారు.
