Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా లీగల్ మెట్రాలజీ ( తూనికలు, కొలతలు ) శాఖలో ఓ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వెంకటసాయి వేయింగ్ సర్వీస్ యజమాని మద్దిశెట్టి వెంకటపతిని ఇన్ స్పెక్టర్ సాయి శ్రీకర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో వెంకటపతి ఏసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నెల్లూరు టెక్కేమిట్టలోని లీగల్ మెట్రాలజీ జిల్లా కార్యాలయంలో 38వేలు లంచం తీసుకుంటుండగా ఇన్ స్పెక్టర్ సాయి శ్రీకర్ రెడ్ ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే కార్యాలయంలో పలు ఫైళ్లను ఏసిబి అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. ఈ దాడుల్లో ఏసిబి డిఎస్పీ శిరీష, సిఐలు శ్రీనివాసులు, ఆంజనేయరెడ్డి, విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
