వైసీపిలోకి జోరుగా వలసలు : ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరికలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రతీ రోజూ వందలాది మంది పార్టీలో చేరుతూ ఆదాల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు. తాజాగా శనివారం 26వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చందులూరు సుభాషిణి కుమారుడు చందులూరు గంగాధర్ యాదవ్ తన అనుచరులతో కలిసి వైసీపిలో చేరారు. వారందరికీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మంచితనం చూసే తాము పార్టీలో చేరామని, వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయమే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపిలో చేరారు. షేక్ అమీర్ జాన్, జాహిద్ ఆధ్వర్యంలో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటూ వారి కుటుంబసభ్యులు కూడా పార్టీలో చేరారు. మంచికి, మానవత్వానికి మారు పేరు అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి అండగా ఉండేందుకే వైసీపిలో చేరామన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆయన్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

Read Previous

అభివృద్ధి చేశాం… ఇంకా చేస్తాం… ఆశీర్వదించండి : నెల్లూరులో విజయసాయి ప్రచారం

Read Next

చంద్రబాబు పరిపాలనతోనే అన్నీ వర్గాల అభివృద్ధి : కోటంరెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.