Clock Of Nellore ( Ulavapadu ) – నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు, కొండేపి నియోజకవర్గాలలోని మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు పార్లమెంటు వైసీపి అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, ఎంపి మోపిదేవి వెంకట రమణ, వైఎస్ఆర్ సిపి ఎస్సి విభాగ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావులు మామిడి రైతులతో ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉలవపాడు పరిసర ప్రాంతాలలో ఎంత మామిడి పంట విస్తరణ ఉంది.. సీజన్ లో ఎంత మొత్తంలో ఉత్పత్తి జరుగుతుంది… ఏ ఏ ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. రైతులు ఎదుర్కొటున్న సమస్యలను విజయసాయిరెడ్డి అడిగి తెలుసుకున్నారు… ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. మామిడి సాగుచేసే రైతులందరినీ సంఘటితం చేసి ఒక సోసైటీ ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో నడిచే విధంగా మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీని ద్వారా రైతులకే మేలు జరుగుతుందన్నారు. మామిడి పరిశోధన కేంద్రం యూనిట్ ను ఉలవపాడు ప్రాంతంలో ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానన్నారు.
