టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు : సాదరంగా ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ప్రతీ రోజూ తండోప తండాలుగా తరలివచ్చి పసుపు కండువా కప్పుకుంటున్నారు. శ్రీధర్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేస్తామంటూ ప్రకటిస్తున్నారు. తాజాగా శనివారం నాడు 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన ఉడతా సుధాకర్ యాదవ్ తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పసుపు కండువాలు వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈనెల రోజులు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని వారికి కోటంరెడ్డి సూచించారు. అలాగే 20వ డివిజన్ కు చెందిన పిడూరు శ్రీనివాసులు రెడ్డి, చిలువూరి హరనాథ్ బాబు కూడా టిడిపిలో చేరారు. వచ్చే నెల 13 వతేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Read Previous

రెడ్డిపాళెంలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా : ప్రశాంతి రెడ్డి హామీ

Read Next

ఉలవపాడులో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు : రైతులకు విజయసాయి హామీ

Leave a Reply

Your email address will not be published.