Clock Of Nellore ( Nellore ) – మే 13వ తేదే…వైసీపీకి చివరి డేట్ అని…రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వానికి తరిమికొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని…మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా… ఆయన నెల్లూరు 4వ డివిజన్ మైపాడు గేట్ సెంటర్, ఆంజనేయస్వామి గుడి తదితర ప్రాంతాల్లో నగర అధ్యక్షుడు మామిడాల మధుతో కలిసి శనివారం పర్యటించారు. ముందుగా నారాయణకి… స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనపై అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ… మహిళలు హారతలు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ఇంటింటికెళ్లి…టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేస్తూ…తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని వివరించారు. ప్రజలందరూ ఆలోచించి…మే 13న జరిగే ఎన్నికల్లో… సైకిల్ గుర్తుపై రెండు ఓట్లేసి…ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని నారాయణ ప్రజలకి విజ్ఞప్తి చేశారు.
అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని…దానికి కారణం…2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన డెవలప్ మెంటేనని తెలిపారు. ఈ డివిజన్‌లో అధిక శాతం నిరుపేదలు జీవిస్తున్నారన్నారు. ప్రచారంలో పలువురు సార్…మేము అప్పుడు డబ్బులు కట్టాము…మాకు ఇప్పటి వరకు ఇల్లు రాలేదని నా దృష్టికి తీసుకువచ్చారు. గత ఐదేళ్లుగా నిరుపేదలకు ఇల్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వాలు మారినా…ప్రజలు మాత్రం ఇబ్బంది పడకూడదని చెప్పారు. ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది లేకుండా చేస్తారో…దానినే ప్రజా పరిపాలన అంటారని తెలియజేశారు. నాయకుడు అనే వాడు ప్రజల్ని పార్టీ పరంగా చూడకూడదన్నారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఏ వార్డ్ కి వీధి కావాలో ఆ వీధికి వేశానని…నేను అప్పుడు మా కార్యకర్త…మీ కార్యకర్త అన్న వ్యత్యాసాలు చూడలేదన్నారు. ప్రజా సమస్యలు తీర్చడమే నాయకుడి లక్షణమని వైసీపీ నాయకులకు ఆయన చురకలంటించారు. నెల్లూరు నగరమంతా 54 డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎండ్ టూ ఎండ్ రోడ్లు, సంగం నుంచి డ్రింకింగ్ పైపులైన్ వేయమని చెప్పానన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ప్రజా సమస్యలపై కంటే…పార్టీ సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారన్నారు. మా పార్టీయే ఉండాలి…మా నాయకులు, కార్యకర్తలు ఉండాలి…వాళ్లు కాకుండా వేరే పార్టీ వాళ్లు ఉంటే…వారి ఆస్తులు ధ్వంసం చేసేవాళ్లని మండిపడ్డారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పడిపోయిందన్నారు.
ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆదాయం రాదో…డెవలప్ మెంట్, సంక్షేమం రెండూ ఆగిపోతాయన్నారు. అది చేయలేక ప్రజల మీద భారం మోపి…ట్యాక్స్ లు వేశారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలపై చెత్త పన్నులు వేశారని…కరెంటు చార్జీలు పెంచేశారన్నారు. టీడీపీ హయాంలో ఒక్క సారిగా కూడా మున్సిపల్ ట్యాక్స్ లు పెంచలేదని గుర్తు చేశారు. నేను మున్సిపల్ శాఖామంత్రి పని చేశానని…114 మున్సిపాలిటీలు నా ఆధీనంలో ఉండేవన్నారు. ప్రతీ సంవత్సరం మున్సిపాలిటీలు పెరుగుతుంటాయని…బిల్డింగ్‌లు పెరుగుతుంటాయని…కొత్తగా లే అవుట్లు వస్తుంటాయని…వాటి వల్ల… ప్రభుత్వానికి ఆటోమెటిక్ గా ఇన్‌కమ్ వస్తూ ఉంటుందన్నారు. కేవలం రాష్ట్రంలో డెవలప్ మెంట్ లేకపోవడంవల్లే…రూ. 13 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరొచ్చి ఏం చేస్తారో తెలియక…వ్యాపారస్తులు అయితే…బిక్కు బిక్కు మంటూ భయపడుతూ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. వ్యాపారస్తులు ప్రశాంతమైన వాతావరణం వ్యాపారాలు చేసుకుంటే…ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుందన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని…అందుకే ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టేందుకు నిర్ణయించుకున్నారని నారాయణ పేర్కొన్నారు. నన్ను ఎవరూ అభివృద్ధి చేయమని అడగలేదని… నెల్లూరు గడ్డపై పుట్టి పెరిగానన్న మమకారంతో…ఏదో ఒకటి చేయాలని రూ. 5,260 కోట్లు తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ది చేశానని గుర్తు చేశారు. ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి…నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని నారాయణ ప్రజల్ని కోరారు. మేమిద్దరం అధికారంలో ఉంటే… భారతదేశంలోనే నెల్లూరుని నెం. 1 మోడల్ సిటీగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
